Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జడ్పీటీసీ సున్నం నాగమణి
నవతెలంగాణ-ములకలపల్లి
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని జడ్పీటీసీ సున్నం నాగమణి మండిపడ్డారు. గురువారం ములకలపల్లి మార్కెట్ యార్డులో మండల కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తాండ్ర ప్రభాకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నెలరోజులుగా రైతులు మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం కొనుగోలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటను కొనుగోలు చేయకుండా రోడ్లపై ధర్నాలు చేయడం డ్రామాగా ఆమె అభివర్ణించారు. రైతుల కోసం తీసుకువచ్చిన వ్యతిరేక నల్లచట్టాలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ . అంజమ్, మండల మైనార్టీ అధ్యక్షులు పుష్పాల హనుమంతు, బాదర్ బాబా, కోండ్రు రవి పాల్గొన్నారు.