Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
మండలం పరిధిలోని పినపాక గ్రామంలో 450 ఎకరాల్లో వరి పంటను వైరా ప్రాజెక్టు కింద సాగుచేశారు. ఎకరానికి 30 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పంట పొందే సమయంలో వైరస్ సోకి వరి పంట పూర్తిగా గడ్డిలా మారింది. ఏం చేయాలో పాలుపోక పశువులను మేపుతున్నామని రైతులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పినపాక గ్రామానికి చెందిన ఈలప్రోలు అనంతయ్య, ముదిగొండ గోపయ్య, కాల్ రాధాకృష్ణ, సబ్బం నాగేశ్వరరావు శబ్దం మధవరావు, తదితర రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.