Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అప్లికేషన్ నింపే విధానంపై
స్పష్టత ఇవ్వని అధికారులు
అ ఏకపక్షంగా గ్రామ కమిటీలు వేశారా
అని ప్రశ్నిస్తున్న వామపక్షాలు
నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ హక్కులకు పోడు భూములకు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల ఆరో తారీకు నుండి అర్హులైన పోడు రైతుల నుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టింది. మొదలు పెట్టినటువంటి ఈ ప్రక్రియ వల్ల పోడు దారులకు ఎటువంటి న్యాయం జరగకపోగా వాళ్లకి పూర్తిస్థాయిలో అన్యాయం జరిగేలా కన్పిస్తోంది. ఏ మాత్రం న్యాయం జరగకపోగా అన్యాయం జరిగే పరిస్థతి ఉంది. ప్రభుత్వం చెప్పినట్లు గానే అధికారుల తూతూమంత్రంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారని పలువురు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ హక్కుల కమిటీలు పని చేయాలి వాటి ఆధారంగానే గ్రామసభ నిర్వహించాలి కానీ కానీ అలా జరిగినట్లు ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. గ్రామసభలు ద్వారా కమిటీలు వేయాలి. వేసిన కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు తీసుకోవాలి కానీ ఎక్కడ జరిగినట్టు ఆధారాలు కనిపించడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతోనే కమిటీలు వేసినట్లుగా, వారి హవానే కనిపించినట్లుగా బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తూతూ మంత్రంగా గ్రామ సభలు ఏర్పాటు చేసినారు తప్ప చిత్తశుద్ధితో అటవీ హక్కులు కల్పించే విధంగా గిరిజనులకు ఏ మాత్రం గ్రామసభలు నిర్వహించ లేనట్టుగా కనిపిస్తుంది. పోడు సాగు దారులకి అప్లికేషన్ పూర్తి చేయడంలో అవగాహన కల్పించి నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులు తప్పించుకొని తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అధికార పార్టీ నాయకులకు చెందిన వారికే పూలు హక్కు పత్రాలు వస్తాయా అన్నట్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారికి పట్టాలు ఏవిధంగా ఇస్తారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఫారం-ఏ వ్యక్తిగతమైన దరఖాస్తు పెట్టుకోవాలి అని సూచిస్తుంది. ఆ దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి ఏం జతపరచాలి అనే విషయాన్ని పూర్తిస్థాయిలో అధికారులు వివరించడం లేదు. అదేవిధంగా ఫారం-బి ఉమ్మడిగా గ్రామం మొత్తం దరఖాస్తు ఇచ్చే విధంగా ఉంటుంది. అధికారులు పూర్తి స్థాయిలో దానిని వివరించడంలో పూర్తిగా విఫలం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది చూస్తుంటే గిరిజనులకు పూర్తిగా అన్యాయం జరిగేలా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో త్వరలో తెలియనుంది.