Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి దశలో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు బండి సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. గురువారం 2019-2021 విద్యాసంవత్సరంలో చర్ల ప్రభుత్వ కళాశాలలో (ఎంపీసీ) 986 మార్కులు సాధించి రాష్టస్థాయిలో తృతీయ స్థానం దక్కించుకొని చర్ల కీర్తి పతాక ఎగురవేసిన నామాల హాసినికు ఇన్స్పైర్ అవార్డు లభించిన తరుణంలో ఆమెను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు కింద ఆమె ఉన్నత చదువులకు గాను ఏడాదికి రూ.80 వేలు ఉపకార వేతనం అందుకోనుందని, అత్యుత్తమ ప్రతిభ చాటిన హాసిని ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి అభినందించారని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆమెకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. చదువులో ప్రతిభ చాటిన కళాశాల విద్యార్థిని హాసినిని ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నామాల హాసిని వలె పట్టువీడని దీక్షతో విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోని చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, ఏజెన్సీ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా హాసినిను పలువురు అభినందించారు.