Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు భూక్యా కిషోర్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టేకులపల్లిలో రాళ్ళబండి రామకృష్ణ రాజు ప్రాంగణంలో జరిగిన మండల మహాసభ మండల అధ్యక్షులు భూక్య రవి అధ్యక్షతన గురువారం జరిగింది. 8వ మండల మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరణ సీనియర్ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నాలుగు డీఏలు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వి.వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హతిరామ్, మండల అధ్యక్ష కార్యదర్శులు రవి, ప్రసాద్ రావు, మంగతాయి, రాంజీ, మధు, బాలు, రామ్ చందర్, మాన్సింగ్, సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. మండల కేంద్రంలో ప్రైమరి పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సామావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి బదిలీలు ప్రమోషన్లు జరగలేదన్నారు. పీఆర్సీ కోసం యూటీఎఫ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అనంతరం నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా అనుకున్నారు. అధ్యక్షులుగా శ్రీను, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, లోకేశ్వరి, కోశాధికారి వీరన్న, కార్యదర్శులు సీతారాం, బాలు, వెంకటనారాయణ, శకుంతల, శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.