Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాదిగా భద్రాచలం న్యాయవాది యం.వి.రమణని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సి.సురేష్ న్యాయవాది ఎం.వి.రమణకి అందచేశారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా పేద ప్రజలకు న్యాయ సలహాలు అందించడానికి వీలుంటుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారు అదేవిధంగా ఆర్ధిక స్తొమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన యం.వి.రమణ వద్దకు వస్తే అట్టి వారికి ఉచితంగా న్యాయం అందించి వారి కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తారు. స్టేట్ లీగల్ సర్వీస్ ఆధారిటి కౌన్సిల్ నిర్ణయం మేరకు యం.వి.రమణ పదవీ కాలం మూడు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది. సామాజిక సేవాకార్యక్రమాలతో పాటు అనేక స్వచ్చంద కార్యక్రమమాలు నిర్వహిస్తున్న యం.వి.రమణ తన న్యాయవాది వృత్తిని యధావిధిగా కొనసాగిస్తూ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకి,సత్వర న్యాయం అందించటానికి ముందుంటానని అన్నారు. ఈ సందర్బంగా ఆమె జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సి.సురేష్‌కి, స్టేట్ లీగల్ సర్వీస్ ఆధారిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.