Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ
నవతెలంగాణ-గుండాల
అంగన్ వాడీ కేంద్రాల విలీనాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐసీడీఎస్‌ను యధావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రమేష్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి, మాట్లాడారు. నిరసనలు చేసినందుకు వేతనాలు కటింగ్ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడి వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని, 2017 నుండి పెండింగులో ఉన్న టీఏడిఏ, సెంటర్ల అద్దెలు, గ్యాస్ బిల్లులు వెంటనే చెల్లించాలని, రేషన్ షాప్‌ల నుండి తెచ్చుకుంటున్న బియ్యానికి ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల బాధ్యులు పాయం సారమ్మ, మెంతిని ధనమ్మ, జవాజి పద్మ, వట్టం పూలమ్మ, కౌసల్య, సరోజ, రాజ్యలక్ష్మి, సంధ్యారాణి, జయలక్ష్మి, మంగమ్మ, నాగమణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : అంగన్వాడీలను పాఠశాలలో విలీనం చేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అంగన్వాడీ కేంద్రాలను విలీనాన్ని రద్దు కోరుతూ సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చిలకమ్మా, నాయకురాలు కమలాదేవి, రత్నావళి, లక్ష్మి, రాధా, సమ్మక్క, భారతి, లీల, సరళ రమ్య తదితరులు పాల్గొన్నారు.