Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు
నవతెలంగాణ-ఇల్లందు
ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నాలు, నిరసనలు చేస్తుంటే ధర్నా చౌక్ ఎత్తేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధర్నా చేసే అర్హత లేదని టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి చాందావత్ రమేష్ బాబు విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డులపై వచ్చి ధర్నాలతో, రాస్తారోకోలతో దీక్షలతో తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఆనాటి విద్యార్థులు ఈరోజు సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నిరుద్యోగ సమస్యను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. రెండు నెలల క్రితం ఢిల్లీ వెళ్లి వంగి, వంగి దండాలు పెట్టిన ముఖ్యమంత్రి సంవత్సర కాలం నుండి ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను కనీసం పారామర్శించలేదన్నారు. మద్దతు తెలపని కేసీఆర్ ఈ రోజు ధర్నా చేయడం కూడా రాజకీయంలో భాగమే అని అన్నారు.