Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-గుండాల
పెసా చట్టం పరిధిలోనే పోడుభూముల సర్వే నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం మండలంలోని సాయనపల్లి గ్రామంలో దుగ్గి రాంమ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సాయనపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కరోనాతో మృతి చెందిన మండల కార్యదర్శి జోగ నర్సయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జోగ నర్సయ్య ఆశయాలను కొనసాగించాలని, మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజా పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు సమస్యల పరిష్కారం సాధ్యం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు గుగులోత్ ధర్మా, అబ్దుల్ నబీ, మండల నాయకులు తోలెం గోపి, గడ్డం క్రిష్ణ, బొమ్మల కనకరాజు, జోగ రాజేష్, వాగబొయిన నర్సింహారావు, కల్తి శేఖర్, కాంతారావు, రామస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.