Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 1535-యూనియన్ ఆధ్వర్యంలో
సీఎండీకి వినతి
నవతెలంగాణ పాల్వంచ
ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535-సెంట్రల్ కమిటీ అధ్యక్షులు యం.ఎ.వజీర్, సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి డి.రాధా కృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో టీిఎస్ ట్రాన్స్ కో టీఎస్ జెన్కో సీఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఉద్యోగ కార్మికుల ఆర్టీజన్ విద్యుత్ కార్మికుల సమస్యల మీద కలిసి చర్చించారు. జీవో 6 ప్రకారం ఏదైతే సెకండ్ డిపెండెంట్ ఉందో దాని మీద, తరువాత డిపెండెంట్ ఉద్యోగాల మీద, తరువాత ఆర్టీజన్స్కు రావాల్సిన కారుణ్య నియామకాల మీద డిపెండెంట్ ఉద్యోగాల బదిలీలపై ఇతర విషయాల విన్నవించారు. దీంతో స్పందించిన సీఎండీ జనవరి-4న మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి, అప్పటి వరకు ఓపిక పట్టండని తెలిపారు. సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెన్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ స్వామి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ తఖి, జనరల్ సెక్రెటరీ నర్సింగరావు, రీజనల్ కార్యదర్శి దనయ్య, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.