Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ ఇల్లందు అధ్యక్షులు బాదావత్ ప్రతాప్
నవతెలంగాణ-టేకులపల్లి
రాష్ట్ర ప్రజలను రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలు గమనించాలని బీఎస్పీ ఇల్లందు అధ్యక్షుడు బాదావతు ప్రతాప్ తెలిపారు. గురువారం టేకుల పల్లిలో విలేకర్లతో మాట్లాడారు. గురిగింజ గురిగింజ ఎలా ఉన్నావ్ అంటే ఎర్రగా ఉన్నాను అందట..? కానీ దాని కింద ఉన్న నల్లమచ్చ గురించి చెప్పకుండా... అలా ఉంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకుల తీరు అన్నారు. ప్రజలను మోసం చేసుకుంటూ, ప్రజలను మభ్యపెడుతూ ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయమంటే, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేడు రైతు మిత్రులం అంటూ రైతుల గురించి ధర్నాలు చేయడం నిజంగా బీజేపీ నేతలు సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేసి ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ని ఎత్తివేసి, నేడు అదే అధికార ప్రభుత్వం అదే ధర్నా చౌక్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం అంటే ప్రభుత్వాలు ప్రజలను ఈపాటికి ఏమార్చాలని చూస్తున్నారో ప్రజలు రైతులు అర్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పి రైతులకు మద్దత్తు ధర ఇచ్చి వెంటనే వరిని కొనాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. బీఎస్పీ నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేదల అభివృద్ధి కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవ చేయడానికి ప్రక్షేత్రంలోకి వచ్చారని తెలిపారు.