Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మీ సేవలు మరువలేనివి
అ మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా కొత్త గూడెం మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్ కుమార్ పలువురు పబ్లిక్ టాయిలెట్స్ కేర్ టేకర్స్‌ను సన్మానిం చారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ప్రజా మరుగు దొడ్లలో (పబ్లిక్ టాయిలెట్స్) కేర్‌టేకర్స్‌గా విధులు నిర్వ హిస్తున్న సిబ్బందిని కమిషనర్ శాలువాలు కప్పి సత్కరిం చారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వివిధ పనుల సంద ర్భంగా సుదూర ప్రాంతాల నుండి కొత్తగూడెం పట్టణ మునకు వచ్చి పోయే ప్రజల అవసరాలను తీరుస్తూ, ఎప్పటి కప్పుడు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచు తూ, ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా విధులు నిర్వహిస్తున్న మీ సేవలు ప్రశంస నీయమన్నారు. పట్టణ పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తూ ''స్వచ్చ కొత్తగూడెం'' సాధనలో వీరు చేస్తున్న కృషి మరువ లేనిదని కొనియాడినారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్పెక్టర్ వీరభద్రా చారి, సానిటరీ జవాన్లు నవీన్, రవి, లక్ష్మణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.