Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ ఆధ్వర్యంలో హరీష్‌రావుకు వినతిపత్రం
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్సును, సిబ్బందిని వెంటనే నియమించి, ప్రజలకు వైద్యం అందించాలని తెలగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసినట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.అయోద్యచారి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏజేన్సీలో వైద్యం అందుబాటులో లేక ప్రజలు మృత్యువాతకు గురి అవుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రిలలో వైద్యం చేయించు కోలేక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సమస్యలను డీఎంహెచ్ఓ ద్వారా వివరాలు సేకరించి పరిష్కరిస్తానని మంత్రి తెలిపినట్టు వారు తెలి పారు. సమస్యను ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి అరుణ దృష్టికి తీసుకెళ్లార న్నారు. వెంటనే ఆసు పత్రిలో సిబ్బందిని నియ మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.