Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఢిల్లీ సరిహద్దులో ఏడాది కాలంగా రైతులు సాగించిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతాంగ విజయానికి ప్రతీక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు, రైతుసంఘాలు, వామపక్షాలు అలుపెరుగక సాగించిన పోరాటాలతోనే ప్రధానమంత్రి మోడీ ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. నల్లచట్టాలను తొలుత వ్యతిరేకించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ తమ పోరాట ఫలితంగా ఆపాదించుకునే ప్రయత్నం చేస్తుండటం హాస్యాస్పదం అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీవ్ర నిర్బంధాలకు ఎదురొడ్డి రైతులు, వామపక్షాలు పోరాడిన ఫలితంగా ఈ రోజు విజయం సాధ్యమైందన్నారు. ఈ చట్టాలు అత్యంత దుర్మార్గమైనవని కేనడా దేశ అధ్యక్షుడు వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించారు. ఈ నల్లచట్టాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), ఇతర వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్, మోటార్ సైకిల్ ర్యాలీలు, మానవహారం, మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఇంకా పలురూపాల్లో నిరసనలు తెలిపామన్నారు. రైతులను బలిగొన్న లఖీంపూర్ ఘటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో వందలాది చోట్ల గత రెండు రోజులుగా ఆందోళనలు చేశామన్నారు. రైతుసంఘాలు చేసిన గొప్ప పోరాటంగా దీన్ని అభివర్ణించారు. పంజాబ్, యూపీ, ఉత్తర భారతదేశం, దేశం యావత్తు రైతుల పోరాట స్ఫూర్తి అభినందనీయమన్నారు. ప్రధాని మోడీ మొండివైఖరి కారణంగా 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. రైతుసంఘం నేత టికాయిత్ చెప్పినట్లు చట్టబద్ధంగా ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని పోతినేని కోరారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్రంగా ఆందోళనలు చేస్తున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న దృష్ట్యా ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చట్టాలు వెనక్కు తీసుకుంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, జిల్లా కమిటి సభ్యులు బండి పద్మ, యర్రా శ్రీనివాస్, మెరుగు సత్యనారాయణ, వై.విక్రం, ఎం.ఏ.జబ్బార్, చింతలచెర్వు కోటేశ్వరరావు, బండారు రమేష్, నందిపాటి మనోహర్, తుషాకుల లింగయ్య, తుమ్మ విష్ణు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తాతా భాస్కరరావు, రైతు సంఘం నాయకులు ఎస్.కె.వి.ఎ. మీరా, వాసిరెడ్డి వరప్రసాద్, మండల కార్యదర్శులు డి.తిరుపతిరావు, బోడపట్ల సుదర్శన్, భూక్యా శ్రీనివాస్, నాయకులు బేగం, అజిత, నాగసులోచన, నాగుల్‌మీరా, జమ్మి అశోక్, భూక్యా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ: సీపీఐ (ఎం), రైతుసంఘం ఆధ్వర్యంలో గోకినేపల్లి, చిరుమర్రి, ముదిగొండలలో రైతు విజయోత్సవ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, రైతుసంఘం జిల్లా నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, ఐద్వా మండల అధ్యక్షకార్యదర్శి మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, సిపిఐ (ఎం) మండల నాయకులు మంకెన దామోదర్, మందరపు వెంకన్న, టిఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, మర్లపాటి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, కట్టకూరు ఉపేందర్, బట్టు రాజు, మెట్టెల సతీష్, సామినేని రామారావు పాల్గొన్నారు.
బోనకల్ : చొప్పకట్ల పాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో సిపిఎం నాయకులు పల్లా కొండల రావు, బోయినపల్లి పున్నయ్య, చలమల అజరుకుమార్, చలమల హరికిషన్‌రావు, తోటకూర మాధవరావు, బొప్పాల రమేష్, పరిటాల కొండలరావు, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : సిపిఎం దాని అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో నేలకొండపల్లి, కోరట్లగూడెం, ముఠాపురం, చెన్నారం గ్రామాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కే వి రామిరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, నాయకులు రచ్చ నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, బెల్లం లక్ష్మి, రైతు సంఘం మండల అధ్యక్షులు సిరికొండ నాగేశ్వరరావు, గంజికుంట్ల వెంకటయ్య, డేగల వెంకటేశ్వరరావు, మందడపు మురళీకష్ణ, బలుసు ప్రమీల, అప్పారావు, షేక్ లాల్ పాషా, డేగల హరిప్రసాద్, గురుజాల ఉపేందర్ పాల్గొన్నారు.
మధిర: పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మండవ పణీంద్ర కుమార్, కమిటీ సభ్యులు నరసింహారావు, మండల కార్యదర్శి సైదులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, పడకండి మురళి, తేలప్రోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్ : గంగారంలోని జాతీయరహదారిపై సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు, బాల బుచ్చయ్య, కుమారస్వామి, కువ్వారపు లక్ష్మణ్ రావు, కృష్ణా, కాకాని శ్రీనివాసరావు, భాగ్యమ్మ, పాకలపాటి జగన్నాధం,, మద్దిశెట్టి పోషయ్య, త్రిమూర్తి, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, నల్లమోతు మోహన్‌రావు, కళ్యాణం కృష్ణయ్య, తెదేపా నాయకులు కూచిపూడి వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్, సత్తెనపల్లి నరేష్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు పార్టీ, ప్రజా సంఘాల, రైతులతో కలిసి బాణాసంచా కాల్చి సంతోషాన్ని వెలి బుచ్చారు. మండల పరిధిలోని భీమవరంలో అమరవీరుల స్తూపం వద్ద మండల రైతు సంఘం కార్యదర్శి గొల్లపూడి కోటేశ్వరరావు రైతులతో కలిసి సిపిఎం జెండాలు చేతపట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, కెవిపిఎస్ మండల అధ్యక్షులు సగుర్తి సంజీవరావు, డివైఎఫ్ఐ నాయకులు వీరాంజనేయులు, సొసైటీ డైరెక్టర్ హరినారాయణ పాల్గొన్నారు.
రేమిడిచర్ల, వెంకటాపురం, గుంటుపల్లి గోపవరం, నరసింహ పురం, బంజర, తదితర గ్రామాలలో బాణాసంచా కాల్చి రైతులకు మద్దతుగా హర్షాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నాగులవంచ వెంకట్రామయ్య, లగడపాటి అప్పారావు, కూడెల్లి నాగేశ్వర్రావు, తాళ్లూరి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని తెల్దారుపల్లి, తల్లంపాడు, కాచిరాజు గూడెం, ముత్తగూడెం, ఎం.వెంకటాయపాలెం, పెద్దతండ పంచాయితీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, సిద్దినేని కోటయ్య, కొప్పుల రామయ్య, బందెల వెంకయ్య, పి.మోహన్‌రావు, ఉరడీ సుదర్శన్ రెడ్డి, పొన్నం వెంకటరమణ, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్‌రావు, డాక్టర్ రంగారావు, నువ్వుల నాగేశ్వరరావు, యామిని ఉపేందర్, వట్టికోట నరేష్, షేక్ రంజాన్ పాషా, తాటి వెంకటేశ్వర్లు, చావా నాగేశ్వరరావు, పెంట్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
బోనకల్ : సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి విజయోత్సవం నిర్వహించారు. అదేవిధంగా రావినూతల, గోవిందాపురం ఎల్ ,ఆళ్లపాడు, రామాపురం, తూటికుంట్ల తదితర గ్రామాలలో సిపిఎం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు గూగులోతు పంతు, బిల్లా విశ్వనాథం, బోయినపల్లి సూర్యనారాయణ, గూగు లోతు నరేష్, ఏసుపోగు బాబు, ఉమ్మినేని రవి, ఏడు నూతల లక్ష్మణరావు, కోట కాటయ్య, కారంగుల చంద్రయ్య, వల్లంకొండ సురేష్ ,కొంగర భూషయ్య, పటాన్ అబ్దుల్ ఖాన్, తాళ్లూరి బాబు, కొమ్మినేని నాగేశ్వరరావు, గుడిపుడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కూసుమంచి : సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బారి మల్సూర్, రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, నాయకులు తోటకూరి రాజు, మల్లెల సన్మతరావు, హళావత్ బాసు, గోపె వినరు, చీర్ల రాధాకృష్ణ, తాళూరి వెంకటేశ్వర్లు, అనిత, ఉల్లోజు కర్ణబాబు, పందిరి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి : కారేపల్లిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో విజయోత్సం జరిపారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం), కాంగ్రెస్, న్యూడెమోక్రసీ నాయకులు కె.నాగేశ్వరరావు, పగడాల మంజుల, వై.ప్రకాష్, గుగులోత్ తేజా, ఎర్రబోడు సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్, సిపిఐ(ఎం) నాయకులు కే నరేంద్ర, వజ్జా రామారావు, తలారి దేవప్రకాష్, ఉమావతి, రేగళ్ల మంగయ్య, దర్గులు, కాంగ్రెస్ నాయకులు ధారావత్ భద్రు నాయక్, గుగులోత్ భీముడు పాల్గొన్నారు.
సత్తుపల్లి : రైతుసంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తాలో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకులు రావుల రాజబాబు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, మండల రైతుసంఘం అధ్యక్షులు బాల బుచ్చయ్య, నాయకులు మోరంపూడి వెంకటేశ్వరరావు, చావా రమేశ్, రవి, పాకలపాటి ఝాన్సీ, తిగుళ్ల లక్ష్మి, చావా కవిత పాల్గొన్నారు.
చింతకాని : సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చింతకానిలో బాణాసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, సభ్యులు వత్సవాయి జానకిరాములు, తోటకూర వెంకటనర్సయ్య, ఆలస్యం రవి, గడ్డం రమణ, దేశబోయిన ఉపేందర్, స్వామి దాసు, నన్నక కృష్ణమూర్తి, కాటబత్తిన వీరబాబు, బల్లి వీరయ్య, కిరణ్ బాబు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ అద్వర్యంలో రైతు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. అనంతరం గజ్జల వెంకటయ్య భవనంలో రైతు విజయోత్సవ సభ జరిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, రైతు సంఘం జిల్లా నాయకులు తుళ్ళూరి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు కొలిచలం స్వామి, నేర్సుల వెంకటేష్, కొమ్ము నాగేశ్వరరావు, కొమ్ము వెంకన్న, శంకర్ లచ్చయ్య, రాములు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల : పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి కొణిజర్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. టపాసులతో సంబరాలు జరిపి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు భూక్యా వీరభద్రం, తాళ్లపల్లి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వర రావు, నాయకులు కొప్పుల కృష్ణయ్య, అన్నవరపు వెంకటేశ్వర్లు, బోయినపల్లి శ్రీనివాసరావు, బానోతు హరిచంద్, ధరావత్ నంద్యా, తాతా వెంకయ్య, కావూరి సత్యనారాయణ, చింత నిప్పు సూరయ్య పాల్గొన్నారు.
వైరాటౌన్ : తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరాలో రైతులు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. వైరా పట్టణంలో బస్టాండ్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సంఘం పట్టణ అధ్యక్షులు పైడిపల్లి సాంబశివరావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, గోపవరం సోసైటి డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, మాజీ సర్పంచ్ పారుపల్లి కష్ణారావు, వాసిరెడ్డి విద్యాసాగర్‌రావు, బొడ్డు నారాయణ, బెజవాడ వీరభద్రం, మాడపాటి వెంకట్, కొంగర సుధాకర్, గుడిమెట్ల మెహన్ రావు, హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి పురుషోత్తం పాల్గొన్నారు.
కల్లూరు : యజ్ఞ నారాయణ పురంలో రైతులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, పార్టీ మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు సామినేని హనుమంతరావు, సామినేని వీరభద్రరావు, మాదల జమలయ్య, రావి వెంకట సత్యం, మండెపూడి నాసరయ్య, రావి లక్ష్మయ్య, మండెపూడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : సిపిఎం ఆధ్వర్యంలో పెనుబల్లి మండల కేంద్రంలో బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల నాయకులు నల్లమల అరుణ్ ప్రతాప్, మేకల బాజీ, కడియం రాజు, రామకృష్ణ, రాములు, మిద్దె స్వామి తదితరులు పాల్గొన్నారు.