Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘర జిల్లా ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి
రైతులు పండించిన ధాన్యానంతా ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ వరపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని సంఘ కార్యాయలంలో నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురదజలు ్లకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెలి శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలగారపు అప్పారావు, పమ్మి వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకుల పాల్గొన్నారు.