Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఈఈయూ (హెచ్ -142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కె.వి.రామారావు
నవతెలంగాణ-పాల్వంచ
రైతు చట్టాల్లాగే... విద్యుత్ సవరణ ఏమేండమెంట్ బిల్లు-2021 కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో విద్యుత్ చట్టాలను సవరణను ఒప్పుకునేది లేదని స్వష్టం చేసారు. తమ యూనియన్ తరుపున రైతుల పక్షాన నిలబడి కేటీపీస్ ప్లాంట్ సెంటర్లో తమ హెచ్-142 యూనియన్ ఒక్కటే రైతులకు సంగీ భావం తెలుపుతూ మహా ధర్నాను విజయవంతంగా చేశామని రా మారావు గుర్తు చేసారు. ఇప్పటికైనా ఉద్యమం దూతం కాకముందే కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టాలపై పునరాలోచించాలని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.