Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధి బొంబాయి కాలనీలో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ డాక్టరు శబారీష్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో టీంలుగా ఏర్పడి నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తిని పట్టుకోని విచారించగా తాను పట్టణం బొంబాయి కాలనీ, ఎన్టీఆర్నగర్కు చెందిన రామకృష్ణ అని తెలిపారన్నారు. తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారన్నారు. భార్య పుట్టింటికి వెళ్లి 3 సంవత్సరాలు అవుతుందని, అప్పటినుండి మద్యానికి బానిసై చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ ఉండేవారని ఏఎస్పీ తెలిపారు. 18వ తేదీన తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తన పక్క ఇంటిలో గల బంధువుల వద్ద గడ్డపలుగు అడిగి, తాగినమైకంలో అక్కడున్న విగ్రహాం ఎవరిదో తెలియకుండా ధ్వంసం చేశానని నేరాన్ని అంగీకరించారన్నారు. గడ్డపలుగును స్వాధీనం చేసుకోని, కోర్టుకు హాజరుపరచడమైందని తెలిపారు. ఈ సందర్బంగా పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.