Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎండి.జైబున్నిస, మండల కార్యదర్శి ఆలేటి సంధ్య మాట్లాడారు. పేదలు జీవించలేని పరిస్థితి దాపురించిందనీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై నిత్యావసర సరుకుల, కూరగాయల ధరలు మోయలేని భారం మోపుతోందన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఐద్వా దశల వారీగా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిగంటి లక్ష్మి, తాళ్లూరి పద్మ, రమ, రాజేశ్వరి, రాణి తదితరులు పాల్గొన్నారు.