Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆపకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
అ సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ఏజే.రమేష్ హెచ్చరిక
నవతెలంగాణ-కొత్తగూడెం
అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయరాదని, పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానంలో భాగంగా రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తున్నదని, దీని వల్ల ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. అత్యధిక కుటుంబాలు గిరిజన, దళిత, వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారన్నారు. టీచర్స్, ఆయాలకు ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు. అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకు పీఆర్సీ వేతనాలు 30 శాతం పెంచినప్పటికీి నేటి వరకు అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు డి.వీరన్న, కొత్తగూడెం ప్రాజెక్ట్ నాయకులు మాధవి, రత్న కుమారి, పద్మ, సుజాత, ప్రసన్న, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.