Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
టేకులపల్లి మండలంలోని 36 గ్రామపంచాయతీలో ద్వారా వేలాది సంఖ్యలో పోడు పట్టాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ కె.వి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గిరిజనులు 5578 మంది, రైతులు, ఇతరులు 441 మంది, రైతులు మొత్తం 6019 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు. 22099.13 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి ఎస్టీ తెగకు చెందినవారు, 18997.06 ఎకరాలకు సంబంధించి ఇతరులు పోడు భూములపై జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అర్హులైన వారికిపట్టా హక్కు వస్తుందని దళారుల మాటలను నమ్మవద్దని పోడు భూముల రైతులకు సూచించారు.