Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించి, పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బి.రాజు డిమాండ్ చేశారు.
శుక్రవారం అశ్వారావుపేటలో జరిగిన యూటీఎఫ్ 8వ మండల మహాసభలో పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కోవిడ్‌కు ముందు 15 వేలమంది విద్యావాలంటీర్లను నియమించారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది కానీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా, విద్యా వాలంటీర్లను నియమించకుండా తాత్సారం చేయటం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందన్నారు.
ఆరేళ్ళుగా ఉపాధ్యాయుల పదోన్నతులు లేవన్నారు. మూడేళ్ళుగా బదిలీలు జరగలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ సిఫారసు ప్రకారం ఏజన్సీ అలవెన్సులు, కన్వేయన్స్ అలవెన్సులు తదితర జీఓలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మహా సభల్లోలో జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్, జిల్లా కార్యదర్శి అశ్వారావుపేట మండల ఇన్చార్జి మురళీమోహన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు టి.వీరేశ్వరావు, ఎం.క్రిష్ణారావు, దమ్మపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు రావెల్ల రమేష్, ప్రధాన సురేష్, ఉపాద్యాయ సంఘం నాయకులు నల్లపు కొండలరావు, కె.హరినాధ్ బాబు, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.