Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సీనీయర్ నాయకులు నాగేశ్వరరావు
నవతెలంగాణ-మణుగూరు
మద్దులగూడెం నుండి వంద పడకల ఆసుపత్రి వరకు గుంతలమయంగా మారిన రోడ్డును నిర్మించాలని, రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనులు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) సీనీయర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవారం వాగుమల్లారం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దులగూడెం చౌరస్తా నుండి వంద పడకల చౌరస్తా వరకు రోడ్డు పనికిరాకుండా పోయిందని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారవుకు, జడ్పీటీసీ నర్సింహారావుకు అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. 1.2 కిలోమీటర్ల పొడవు ఉన్నా ఈ రోడ్డుపై కాలనీ, ముత్యాలమ్మనగర్, మద్దులగూడెం, వెంకటపతినగర్ తదితర గ్రామాల నుండి ప్రజలు ఈ రోడ్డుపై నుండే ప్రయాణం కొనసాగిస్తుంటారు. వెంటనే రోడ్డును నిర్మించాలని, సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని కోరారు. లేనిచో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొడిశాల, రాములు, లెనిన్, టివిఎంవి.ప్రసాద్, ఉప్పతల నర్సింహారావు, ములకల ఉత్తమ్, వైనాల నాగలక్ష్మీ, అనసూయ, కృష్ణ, శ్రీను, వంశీ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.