Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత రమేష్
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచకరంగా ఉందని సామాజిక ఉద్యమకారుడు అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గద్దల రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో వీరిద్దరు చేస్తున్న ధర్నాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఈ క్రమంలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతాంగంకు పెద్దపీట వేస్తున్నామని రైతుబంధు, రైతు బీమా, తీసుకువచ్చి రైతులను లాభసాటిగా మారుస్తామని గొప్పలు చెప్పి ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల మాగాని చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు యాసంగి సీజన్ నుండి ధాన్యం కొనుగోలు చెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేయడం ఆపి వడ్లు కొనుగోలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు.