Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాశీనగరం సర్పంచ్ పూనెం కనక దుర్గ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్ అధ్యక్షురాలి ఎంపికను రైతుల ఆమోదం లేకుండానే కార్యనిర్వహక కమిటీ అధ్యక్షురాలిగా జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ ప్రకటించుకోవడంతో పాటు పత్రికా ప్రకటనలు ఇచ్చారని, కాశీనగరం సర్పంచ్ పూనెం కనకదుర్గ ఆరోపించారు. శుక్రవారం కాశీనగరం గ్రామంలో జరిగిన ఆయుకట్టు రైతుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు అవుతున్న ప్రగళ్లపల్లి లిఫ్టు రైతుల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేస్తున్నామని బహిరంగ దండోరా వేయించిన జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ అసలు సమస్యను సమావేశంలో చర్చించకుండా లిఫ్టు ఇరిగేషన్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షురాలిగా ఆమె ప్రకటించడం ఆయుకట్టు రైతులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం లిఫ్టు ఇరిగేషన్ అధ్యక్షుడిగా తంత్రపల్లి విద్యాసాగర్ కొనసాగుతున్నారని ఆమె అన్నారు. ఈ సమావేశంలో లిఫ్టు ఇరిగేషన్ మాజీ అధ్యక్షులు బోనాసి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బిళ్లా శేఖర్, విద్యాసాగర్, కొమ్ము సత్యనారాయణ, పాశం వెంకటేశ్వరరావు, వెంకన్న, నర్సయ్య, సురేందర్, ప్రభాకర్లతో పాటు సుమారు 100 మంది ఆయుకట్టు రైతులు పాల్గొన్నారు.