Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంట్రీ పాస్లేని వారికి అనుమతి లేదు
అ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మద్యం పాలసీ 2021-2023 ప్రకారం మద్యం దుకాణాలు ఏర్పాటుకు దరఖాస్తు చేసిన వ్యాపారుల సమక్షంలో 20వ తేదీ శనివారం కొత్తగూడెంలోని కమ్మ వారి కల్యాణ మండపంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారని, డ్రాకు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని, ఎంట్రీ పాస్ ఉన్న వారికే అనుమతి ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారుల నుండి దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు దారులకు దుకాణాల వారిగా సీట్లు కేటాయింపు చేశామని కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పారు. ఎంట్రీ పాస్ లేని వ్యక్తులను లోనికి అనుమతించమన్నారు. లాటరీ పద్ధతిలో షాపులకు గెజిట్ సంఖ్య వారీగా డ్రా తీయడం జరగుతుందన్నారు. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు చలానా కట్టడానికి ఎస్బిఐ ద్వారా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హాల్ వద్ద ఫైర్ ఇంజన్, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లాటరీ నిర్వహణ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేయబడుతుం దని చెప్పారు. రద్దీ నియంత్రణకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లాటరీ నిర్వ హణకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని ఎక్స్సైజ్ అధికారులను ఆదేశిం చారు. జిల్లాలోని మొత్తం 88 మద్యం దుకాణా లకు గాను 44 ఎస్టీలకు, 7 ఎస్సిలకు, 6 గౌడలకు, 31 ఇతరులకు కేటాయిం చినట్లు గుర్తుచే శారు. మద్యం దుకాణా లు ఏర్పాటుకు దరఖాస్తు చేసిన వ్యాపారులు కానీ అతని నుండి ఆథరైజేషన్ తీసుకున్నా వ్యక్తులు లాటరీ నిర్వహణకు హాజరు కానట్లైతే అటువంటి వారికి లాటరీ నిర్వహణకు అవకాశం లేదని లాటరీ నుండి వారిని తొలగించడం జరుగుతుందని చెప్పారు.