Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ధాన్యం అమ్ముకునే రైతులుకు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఓటీపీ వస్తేనే ధాన్యం సేకరణ జరుగుతుందని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని నామవరం రెవెన్యూ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు నాణ్యమైన ధాన్యాన్నే ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ప్యాడి ఖ్లీనర్లో తూర్పాలు పోయాలని, 17 శాతం నిమ్ముశాతం వచ్చాకే కొనుగోల్లు చేయాలన్నారు. అదేవిధంగా డీసీఓ వెంకటేశ్వర్లు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, తాలు ఉన్న ధాన్యాన్ని సేకరిస్తే అధికారులుపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సున్నం వెంకటేశ్వరావు, సెంటర్ ఇన్చార్జ్ నాగేంద్రబాబు, రైతులు బన్నె ఏసుబాబు, లీలాకుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.