Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) నాయకులు సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
భారతదేశ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సంవత్సర కాలంగా ఢిల్లీ బోర్డర్లో దీక్ష చేస్తున్న రైతుల పోరాట ఫలితమే నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగిందని ఇది రైతుల విజయమని సీపీఐ(ఎం) మండల నాయకులు ఉరడి సుదర్శన్ రెడ్డి అన్నారు. నల్ల చట్టాలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని ఏదులాపురం, పొన్నెకల్లు, గుదిమళ్ళ, వెంకట గిరి, మద్దులపల్లి, అరేంపుల, అరేకొడు గ్రామాల్లో ఆదివారం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో వర్షం, చలి, ఎండను సైతం లెక్కచేయకుండా 360 రోజులు దీక్ష చేసిన రైతులకు విప్లవ శుభాకాంక్షలు తెలిపారు. 750 మంది రైతులు చనిపోయిన పట్టు వివడవకుండా మొక్కవోని దీక్షతో రైతులు పోరాటం చేసారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నెకంటి సంగయ్య, మాంమిడ్ల విష్ణు వర్ధన్ రెడ్డి, అనిష్, గడ్డం సిద్దు, విజరు రెడ్డి, కోటి శ్రీనివాసరావు, కిరణ్, పాషా, కత్రం ఉపేందర్, సాల్వే వెంకటేశ్వర్లు, జింక బాలరాజు, పెంట్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, అరేంపుల నరేష్, పవన్, యమునకర్, లాలూ పాల్గొన్నారు.