Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన
టీఆర్ఎస్వీ నాయకులు
నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి జగన్నాధపురం వయా సీతాయిగూడెం, సూరంపాలెం, కమలాపురం, రామంజనేయపురం మీదుగా నడిచే బస్సు సర్వీసును కరోనా కారణంగా రద్దు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి కళాశాలలకు వెళ్లాలంటే బస్సు సర్వీస్ లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్వీ మండల నాయకులు గుంటూరు కృష్ణ, సురభి రాజేష్‌లు ఆదివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ఆర్టీసీ డీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్య వివరించగా మరో రెండు రోజుల్లో బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీటీసీ నివాసంలో ఎమ్మెల్యే మెచ్చా
మండల కేంద్రంలోని ములకలపల్లి ఎంపీటీసీ శెనగపాటి మెహరామణి, సీతారాములు దంపతుల నివాసానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం వెళ్లారు. ఇటీవల ఆ దంపతులు నూతన గృహప్రవేశం చేసుకోవడంతో ఆ సమయంలో వీలుపడక ఎమ్మెల్యే రాలేకపోవడంతో మండల పర్యటనకు వచ్చిన ఆయన మెహరామణి నివాసానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మంగపతి, రవి, సురభి రాజేష్, టీఆర్‌ఎస్‌ఎస్‌వీ నాయకులు ఉన్నారు.