Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నేడు సీపీఐ (ఎం) మండల 8వ మహాసభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్ ప్రాంగణంలోని అమరవీరుల నగర్లోని అమరులు మాజీ ఎమ్మెల్యేలు కుంజా బాజ్జి, సున్నం రాజయ్య, రేసు భద్రమ్మ, కొర్శ రాంబాయి, సోయం కామయ్య, పెనుబల్లి భద్రయ్య, పుసం అంజమ్మ, కాకా శ్రీరాములు, మచ్చ ముత్తయ్య, కొమరం రాధాకృష్ణ, బొల్లి నరసమ్మల అమరవీరుల ప్రాంగణంలో జరిగే ఈ మహాసభకు మాజీ ఎంపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సభ్యులు మిడియం బాబూరావు, పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచిలి రవి కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.