Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్లో కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఓటర్ల మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజలు ఓటర్లు మార్పులు మరియు చేర్పులు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఎస్కె వలి, సుధాకర్, కె భిక్షం, ఎన్, మల్సూర్, వి, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.