Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హమాలీ అండ్ మిల్ వర్కర్ యూనియన్
( ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్య డిమాండ్
నవతెలంగాణ-కల్లూరు
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు చట్టాల అమలు చేస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలీ అండ్ మిల్ వర్కర్ యూనియన్( ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన హమాలీ సభలో ఆయన మాట్లాడుతూ.. బరువులు మోసే హమాలీలకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. ఎండకు ఎండి వానకు తడుస్తూ బరువులు మోసే ఎగుమతులు దిగుమతులు చేసే హమాలీలకు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. వారికి కనీసం పనికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదువేల పెన్షన్, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ.వెంకన్న, హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు. రామారావు, కార్యదర్శి డి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సభలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కే పుల్లారావు, సీతారాములు, హమాలీ సంఘం నాయకులు ఏడుకొండలు, పుల్లయ్య, వెంకట్రావు, అంజన్ రావు, కోటేశ్వరరావు, జానీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి మాలాద్రి, తదితరులు పాల్గొన్నారు.