Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టేకులపల్లి అటవీ
ప్రాంతంలో ప్రవేశించిన పులి
అ మొట్ల గూడెం జంగాలపల్లి
గేటు వద్ద ప్రత్యక్షం
అ ధృవీకరించిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ-టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శెట్టిపల్లి-ఆళ్లపల్లి ప్రధాన రహదారిపై టేకుల పల్లి మండలంలోని మోట్ల గూడెం గ్రామ సమీపంలోని జంగాలపల్లి గేటు వద్ద శనివారం తెల్లవారు జామున రోడ్డు దాటుతున్న పెద్దపులి దృశ్యాలను ఫారెస్ట్ సిబ్బంది వీడియో తీశారు. గత కొన్ని రోజుల నుండి పెద్దపులి అటవీ ప్రాంతంలో తిరుగుతుందని ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది నిఘా వేసినట్లు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న కొత్తగూడెం ఎఫ్డీఓ అప్పయ్య, ఫారెస్ట్ రేంజర్ ముక్తార్ హుస్సేన్లు ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ గ్రామాలైన జంగాలపల్లి, మోట్ల గూడెం, సిద్దారం తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండవ రోజు ఆదివారం టేకులపల్లి-బోడు రోడ్డు మార్గంలో పెద్దమ్మతల్లి గుట్ట-ఆంజనేయ పాలెం సమీప అడవుల్లో పులి వరి పొలాలలో వెళుతుండగా రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించారు. ఆంజనేయ పాలెం నుండి మండలంలోని రోల్లపాడు ప్రాజెక్టు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. ఏది ఏమైనా పెద్దపులి మండల పరిధిలో తిరుగుతుండడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.