Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలోని బయ్యారం మండలం గంధం పల్లి గ్రామానికి చెందిన ఉపేందర్(32), తిరుపతమ్మ(28) దంపతులు ఇటీవల విద్యుత్ద్ఘాతంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి ఆ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. దంపతుల కుమార్తెలు శ్యామల, బిందువులను చూసి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఆ కుటుంబానికి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆ చిన్నారు లకు విద్యా పరంగా ఆదుకుం టామని, వైద్యపరంగా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఇల్లెందులో తన వైద్యశాలకు వస్తే ఉచిత వైద్య సేవలు అందిస్తానని ఆ కుటుంబాని కి హామీ ఇచ్చారు. రవి వెంట కాం గ్రెస్ సీనియర్ నాయకులు జీవి భద్రం, శ్రీను, మహేష్ ఉన్నారు.