Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు ఆళ్ళపల్లి మండల ఎంపీపీ మంజుభార్గవి కృషితో మండలకేంద్రంలోని ఒకటో వార్డ్, రెండో వార్డుల్లో మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయా వార్డ్ మెంబర్లు నరెడ్ల సరిత, మహమ్మద్ ఖయ్యుం అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పనులు ఆళ్ళపల్లి మండలం కేంద్రములో పూర్తిస్థాయిలో పనులు జరగకపోగా, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గుర్తించి స్థానిక ఎంపీపీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే జిల్లాలోని ఉన్నతాధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందించాలని ఆదేశించడం జరిగిందన్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పనులు అవుతున్నాయని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ పనులు వార్డుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు వార్డు మెంబర్లు హర్షం వ్యక్తం చేస్తు, స్థానిక ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి నరెడ్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.