Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ ప్రోత్సాహలు మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
అ జిల్లా మత్స్యశాఖ అధికారి కె.వరదారెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం అందించే పథకాలు మత్స్యకారులు అందుకుని అభివృద్ధి చెందాలని జిల్లా మత్స్యశాఖ అధికారి కె.వరదారెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవమును జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మత్స్య సంఘాల సభ్యులు మత్స్య కృషీవలులు పాల్గొని చేపల పెంపకంలో వారి వారి అనుభవాలను వివరించారు. అదేవిధంగా మత్స్యసంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరము కూడా జిల్లామత్స్య శాఖ ఆధ్వర్యములో ప్రపంచ మత్స్య దినోత్సవమును జరుపుకొనుట సంతోషంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి కె.వరాదా రెడ్డి మాట్లాడారు. మత్స్యకారులకు, మత్స్య కృషీవలులకు ప్రభుత్వం ఎన్నో రకాల సబ్సిడీలను అందజేసి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. వాటిని లబ్దిదారులు వినియోగించుకుని అభివృద్ది చెందాలని, మత్స్య సంపద పెంచాలని కోరారు. ప్రపంచ మత్స్య దినోత్సవము ప్రాముఖ్యతలను వివరించారు. జిల్లాలోని వివిధ మత్స్య సొసైటీల సభ్యులు, మత్య్సకారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.