Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
అ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ని కలిసిన ఎడవల్లి
అ కొత్తగూడెం నియోజకవర్గ సమస్యలపై వినతి
అ కొత్తగూడెం రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అ త్వరలోనే పర్యటిస్తానని ఎడవల్లికి హామీ
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం నియోజవర్గంలో పోడు భూముల సమస్య విపరీతంగా ఉందని రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నివాసంలో ఆయనతో కలిసి చర్చించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ రైతులు పోడు చేసుకుని వారి జీవితాన్ని గడుపుతున్నారని, అటువంటి రైతులను పట్టాలివ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు మోసం చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఇచ్చే విధంగా చేయాలని అలాగే, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడా లని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నియోజ కవర్గంలో ఎమ్మెల్యేలపై వస్తున్న ప్రజావ్య తిరేకతను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు. దాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీతో పాటు నడుస్తారని అన్నారు. అనంతరం నియోజవర్గానికి రేవంత్ రెడ్డిని రావాలని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని ఆమోదం తెలిపి త్వరలోనే కొత్తగూడెం నియోజకవర్గానికి పర్యటిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.