Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాల్వంచ యూటీఎఫ్ 8వ మహాసభలో
జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్
అ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్ష, కార్యదర్శులుగా కే.రాంబాబు,
ఎస్.కె..యాకూబ్ పాషా ఎన్నిక
నవతెలంగాణ-పాల్వంచ
ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కిషోర్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పాల్వంచ మండల శాఖ ఎనిమిదో మహాసభ అధ్యక్షులు మంగీలాల్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడెంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉన్నత పాఠశాలలో ఖాళీలను భర్తీ చేసి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించాలని హెల్త్‌కార్డులు సరిగా పనిచేసేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు జిల్లా కార్యదర్శులు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.రాధాకృష్ణ వ్యవహరించగా నూతన అధ్యక్షులుగా కె.రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కే.యాకూబ్ పాషా, సహా అధ్యక్షులుగా బాలు, కే.శోభారాణి, కోశాధికారిగా నరసింహారావు, కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు, బి.సుధాకర్ భీమ్, కే.సంతోష్, బి.లక్ష్మణ్, ఎస్.రాజశేఖర్, ఎం.రాజులు, ఎస్కె రహీమ్ ఉద్దీన్, జి.హరి, పి.శ్రీదేవి, సిహెచ్ సతీష్ బాబు, జి.దేవిశ్రీ, మండల ఆడిటర్‌గా కె.ముత్తయ్య, మహిళా సబ్ కమిటీ కన్వీనర్‌గా ఎండి అభి భూన్నిషా, సోషల్ మీడియా కన్వీనర్‌గా రాజశేఖర్‌లను హరి కవిత, జయలక్ష్మి, శ్రీనివాస్, జిల్లా మహాసభ ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో వాసంతి తామస్, సత్యనారాయణ, జానకి రాములు, గోవిందరావు, వీరస్వామి, నాగమణి, వనిత తదితరులు పాల్గొన్నారు.