Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చావా రవి
నవతెలంగాణ-ఇల్లందు
టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు సింగరేణి ఉపాధ్యాయులు పి.రామకోటయ్య (57) గుండెపోటుతో శనివారం గోదావరిఖనిలో మృతి చెందారు. పార్థివ దేహాన్ని స్వగ్రామం భద్రాద్రి జిల్లా ఇల్లందుకు ఆదివారం తరలించారు. రామకోటయ్య హఠాన్మరణం పట్ల టీఎస్యూటీిఎఫ్ రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
విషయం తెలుసుకున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్ ఉపాధ్యక్షురాలు వి.వరలక్ష్మి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఏ.రాంబాబు పి.జయరాజు, ఉపాధ్యక్షురాలు కె.అన్నపూర్ణ, గుండాల మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు యూటీఎఫ్ సీనియర్ నాయకులు పి.వెంకటేశ్వర్లు తదితరులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మాట్లాడారు. పెత్తందార్లు దొరలను ఎదిరించి యూటీఎఫ్ సంఘాన్ని నిలబెట్టిన ధీశాలి రామకోటయ్య అన్నారు. వృత్తిలో చేరిన నాటినుండి సంఘ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవారని, ఇల్లందు ప్రాంతంలో అభివృద్ధి కోసం కృషి చేసే వారని అన్నారు. రామకోటయ్య మృతి సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.
నివాళులర్పించిన : సీపీఐ(ఎం)
యూటీఎఫ్ నాయకులు రామకోటయ్య మృత దేహాన్ని సీపీఐ(ఎం) నేతలు దేవుల పల్లి యకయ్యా, అబ్దుల్ నబి, ఆలేటి సంధ్యా, కిరణ్, మరియా, మోహ న్ రావు, విజయకుమార్, ఖాదర్ బాబు, కృష్ణ దర్శిం చి నివాళులర్పించారు. మృతి బాధాకరమన్నారు. కుటుంబానికి సంతాపం తెలిపారు.