Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సాంబశివ రెడ్డి
నవతెలంగాణ-పినపాక
పౌరులందరూ సమాజసేవలో ముందుండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టి.కొత్తగూడెం గ్రామంలో యువకులకు నాసిరెడ్డి వినరు కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.30 వేల విలువైన మైక్ సెట్ బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివరెడ్డి మాట్లాడుతూ అకినేపల్లి మల్లారం, టీ కొత్తగూడెం గ్రామాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజోపయోగ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉచితంగా ఈ మైక్ సెట్‌ని వినియోగించుకోవచ్చనని తెలిపారు. సమాజసేవలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వినరు కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి సేవలను సాంబశివ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అకినేపల్లి మల్లారం, టీ.కొత్తగూడెం గ్రామాలలో యువత నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఈ మైక్ సెట్‌ను ఉపయోగించుకునే విధంగా తన కుమారుడు కీర్తిశేషులు నాసిరెడ్డి వినరు కుమార్ రెడ్డి పేరిట బహూకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు నాసిరెడ్డి నాగిరెడ్డి, భార్గవ్ రెడ్డి, కృష్ణారెడ్డి, యూత్ ప్రతినిధి గాలి వేణు, వికాస్ ఆగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి, తిరుపతి రావు, యువజన సంఘం సభ్యులు శెట్టిపల్లి బాలు, వినరు, పాల్గొన్నారు.