Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
శాంతి భద్రతలను పాటిస్తూ సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, దోపిడీలు, విధ్వంసాలు జరగకుండా కాపాడే వారే నిఖార్చైన పోలీస్, ఫ్రెండ్లీ పోలిస్ అనే నిర్వచనానికి కేరాఫ్ అడ్రస్ జూలూరుపాడు మండలం. ఎస్సై పి.శ్రీకాంత్ ఒక ప్రక్క శాంతి భద్రతలను కాపాడుతూ, మరో ప్రక్క తనదైన శైలిలో మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు దగ్గరై అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మండల ప్రజలతో మమేకమై విధినిర్వహణలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, పేదలకు సహకారాలు అందిస్తూ ప్రజలపై అంతే ప్రేమను చాటుతున్నారు. ఎస్పై పి.శ్రీకాంత్ ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయన సేవాతత్వం చాటుతూనే ఉన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలకు అవస్థలు పడుతున్న విషయం తన దష్టికి వచ్చిన సందర్భంలో గతంలో తహసీల్దార్ విజరు కుమార్ సహకారంతో ఆహారం అందించి తనకు తెలిసిన ఆటో డ్రైవర్లను పిలిపించి వారి ఇళ్లకు పంపించే వరకూ వారిపై శ్రద్ధ చూపించేవారు. వచ్చిన అనతి కాలంలోనే జూలూరుపాడు మండల ప్రజల మనసులకు ఆయన ఎంతో దగ్గరయ్యారు. ఇంత పెద్ద గొప్ప మనసున్న మహారాజు జూలూరుపాడు మండల ఎస్సైగా రావడం మండల ప్రజల అదృష్టమని, మండలంలోని పెద్దలు చెప్పుకుంటున్నారు. ప్రజల రక్షణ కోసం వచ్చిన పోలీస్ అధికారి, ఇలాంటి సేవా కార్యక్రమాలు సహాయ సహకారాలు, జూలూరు పాడు మండల ప్రజలకు అందించడం ఎంతో అభినందనీయమని, మండలంలోని కొందర ప్రముఖులు ప్రశంసిస్తు న్నారు. ఆయన మండలంలోని యువతకు మార్గదర్శ కంగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువత చెడు వ్యసనాలకు బానిసలై జీవితాల్ని అంధకారం చేసుకోకూడదని, పెడదోవ పడుతున్న యువతలో మార్పే లక్ష్యంగా, ఎస్సై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, యువతను మేల్కొల్పుతూ, వారికి చక్కటి ఉపన్యాసాలు ఇచ్చేవారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడుతూనే ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. మాట కరుకు మనసు వెన్న చూడటానికి ఎంతో గంభీరంగా ఉండి కోపంగా కనపడతారు. కానీ ఆయన జాలిగుణం, దయా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆయనతో మాట్లా డితే తెలిసిపోతుంది. ఎవరైనా తప్పులు చేస్తే వారి తప్పులను సరిదిద్దుకునేలా చేసే క్రమంలో ఆయన మాటలు వింటే చాలు మళ్ళీ అలాంటి తప్పులు జీవితంలో చేయాలన్న ఆలోచన కూడా రానంత చక్క గా మాట్లాడుతారు అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. ఆయన మండల ఎస్ఐగా వచ్చిన దగ్గరనుండి మండ లంలో గంజారు, పేకాట, గుట్కాలు, నాటుసారా, వంటి చెడు వ్యసనాలు బెడద చాలావరకు తగ్గిందని మండల ప్రజలు చెప్పుకుంటున్నారు.