Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్టు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఎర్ర బోరు గ్రామానికి చెందిన కొమరం రాజులు (48) ఈ నెల 20వ తేదీన సున్నంబట్టి గ్రామ శివారులో గల గోదావరి నదికి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయి కనిపించకుండా పోయాడు. దీనిపై మృతుడి భార్య సుభద్ర ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేస్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా ఆదివారం గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో దుమ్ముగూడెం గ్రామ శివారులో గల గోదావరి నది నీటిలో తేలాడుతూ మృత దేహం కనిపించాడు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.