Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పార్లమెంట్లో రద్దు ఆమోదించే వరకూ పోరాడుదాం
అ రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్ష ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశరాజధానిలో ఏడాది కాలంలో రైతులు, విపక్షాలు, దేశ ప్రజల సమిష్టి పోరాట ఫలితంగానే రైతు వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించిందని, ఇది మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని విపక్ష ప్రజా సంఘాల జిల్లా నేతలు స్పష్టం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన వామపక్షాలు, విపక్షాల అనుబంద ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడారు. సుధీర్గకాలంగా సాగిన సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం మోడీకి కనువిప్పు కలిగించిందని, కార్పొరేట్ శక్తుల మత్తు వదిలించిందన్నారు. కార్పొరేట్, పెట్టుబడిదారుల దనదాహం ఏడువందల మంది రైతులను బలితీసుకుందని విమర్శించారు. పాలకులు ఇప్పటికైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. సాగు చట్టాల రద్దు కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా త్వరితగతిన పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రద్దు చేయాలని, మూడు సాగు చట్టాలతోపాటు విద్యుత్ సంస్కరణల బిల్లును కూడా చేర్చి రద్దు చేయాలని, ఏఐకెఎస్ సీసీ ప్రతినిధులు ప్రభుత్వం ముందు ఉంచిన రైతు డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా చీకటి చట్టాలు రద్దు చేసేవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, ఐఎన్టియూసీి జిల్లా నాయకులు కాలం నాగభూషణం, ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు వై.ప్రకాష్, రైతు సంఘం నాయకులు మోతుకూరి మల్లికార్జున్, అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, ఇఫ్లూ జిల్లా నాయకులు మోతుకూరి మల్లిఖార్జున్, ఏఐకెఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, ఇఫ్లూ జిల్లా నాయకులు కందగడ్ల సురేందర్ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో సీపీఐ అనుబంద ప్రజా సంఘాల నాయకులు జర్పుల ఉపేందర్, మామిడాల ధనలక్ష్మి, పిట్టల రాంచందర్, దారలక్ష్మి, సీపీఐ(ఎం) అనుబంధ ప్రజా సంఘాల నాయకలు జాటోతు కృష్ణ, నాగేశ్వర్ రావు, భూక్య రమేష్, వీరభద్రం, వీరన్న, న్యూడెమోక్రసి పార్టీల అనుబంధ ప్రజా సంఘాల నాయకులు పి.సతీష్, ముద్దాబిక్షం, మోరె రవి, అమర్లపూడి రాము, పర్సక రవి, భాస్కర్, జానకి, కిశోక్, జ్యోతి, సత్యం, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.