Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
డివిజన్ పరిధిలో పండిన ప్రతి ధాన్యపు గింజా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేయాలని, యాసంగి లో వరి పంటకు అవకాశం కల్పించాలని, రైతు ఉద్యమంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కల్లూరు ఆర్డిఓకి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి మండలం నాయకులు కొలేటి వెంకటేశ్వరరావు, సిపిఐ కల్లూరు మండల కార్యదర్శి దమాల దయాకర్రావు, సిపిఐ నాయకులు నరసింహారావు, రాంబాబు రాము తదితరులు పాల్గొన్నారు.