Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కార్మికులకు రక్షణపై అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-మణుగూరు
సెల్ఫోన్ పక్కన పెట్టి, సీటు బెల్టును నడుముకు పెట్టుకోవాలని ఓసి 4 ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాములు అన్నారు. సోమవారం దుర్గా ఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్ కంపెనీ (ఎంఐపిఎల్) ఆవరణంలో భారీ యంత్రాల ఆపరేటర్లకు, డ్రైవర్లకు అవగాహానా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించినవారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, సీటుబెల్ట్ దరించడం భారంగా భావించదన్నారు. చలికాలంలో మంచు కురిసే వేళలో అనుక్షణం అప్రమత్తంగా ఉండి భారీ యంత్రాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ4 రిలే బి.ఓబి ఇంచార్జ్ శ్రీనీవాసరెడ్డి, హెడ్ఓర్మెన్ సామ్యూల్, దుర్గా మేనేజర్ రవిశంకర్, నాసర్పాష, దుర్గా సిబ్బంది, ధిరజ్, నాగేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.