Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పాంగీ ప్రసాద్‌కు గంజాయి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఒక లక్ష ను విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.చంద్రశేఖర్ ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం 5-1-2016న భధ్రాచలం పోలీసులు తనిఖీ లలో బాగంగా విశాఖపట్నం నుండి భధ్రాచలం వచ్చే ఏపిఎస్.ఆర్టిసీ బస్‌ను కూనవరం రోడ్డు, భధ్రాచలం దగ్గర బస్సు ను ఆపి తనిఖీ చేయగా నిందితుడు దగ్గర 50 కేజీల గంజాయిని 9 బండిల్స్ గా చేసి 2 కవర్ లలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు లో చార్జీషీట్ ధాఖలు చేయగా అట్టి కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడుపై నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్తా వెంకటేశ్వర్లు వాదించిగా, కోర్టు కానిస్టేబుల్ జి.మురళీకృష్ణ , లైజన్ ఆఫీసర్ జి.ముత్తయ్య , హౌంగార్డు యం.డి ఆయ్యూబ్ లు సహకరించారు.