Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భారీగా తరలివచ్చిన విశ్వాసులు
నవతెలంగాణ-కొణిజర్ల
తనికెళ్ళ గ్రామంలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన 52 అడుగుల యేసు స్వరూపం సోమవారం సాయంత్రం ఘనంగా అవిష్కరించారు. ఈ 52 అడుగుల యేసు స్వరూపం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఎక్కడలేదని నిర్వహకులు పేర్కొన్నారు. నిర్వహకులు విశ్వాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. ఈ యేసు స్వరూపం చూసేందుకు ఉమ్మడి జిల్లాల నుంచి విశ్వాసులు ఆధిక సంఖ్యలో హజరైయ్యారు. దీంతో స్వరూపం ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం, విజయవాడ, ఏలూరులకు చెందిన పీఠాధిపతులు మైపన్ పాల్ తోలగతోటి రాజారావు పాలిమేర జయరావు హజరైయ్యారు.