Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆర్డీఓ హామీతో దిగొచ్చిన మహిళ
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలోని హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన షేక్ అభి దాబి తన భూమి పట్టా కాలేదని సోమవారం మండల కేంద్రంలో ఉన్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. గతంలో 3 సార్లు ఇదే ట్యాంక్ ఎక్కినా గత తహసిల్దార్లు హామీ ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోవడంతో మళ్ళీ 4వ సారి నిరసనకు దిగింది. నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానని మహిళ తెలిప టముతో ఎస్ఐ భవాని వారి సిబ్బందితో మహిళతో మంతనాలు జరిపారు. తహశీల్దార్ దొడ్డే పుల్లయ్య, అర్డిఓ రవీంద్రనాద్కు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన ఘటన దిగడం అంటే ఆర్డిఓ వచ్చేంతవరకు నేను దిగాను అని ఆ మహిళ మొండికేసింది. ఘటనా స్థలికి చేరుకొని భూమి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళ కిందకి దిగింది. దీంతో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు