Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బత్తుల హైమావతి
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మహిళా హక్కుల పరిరక్షణకు సమిష్టి గా మహిళలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బత్తుల హైమావతి, జిల్లా కమిటీ అధ్యక్షురాలు బండి పద్మ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని భీమవరం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మండలస్థాయి మహిళా కమిటీ సమావేశాన్ని దేవరకొండ అనితా అధ్యక్షతన నిర్వహించారు. తొలుత కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు నల్ల చట్టాల రద్దు చేసిన సందర్భంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యురాలు బత్తుల హైమావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల మహిళా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గొల్లపూడి లక్ష్మీ, దేవరకొండ అనిత, ఉపాధ్యక్షురాలిగా కల్పనా దత్తు, మేరగాని నాగమణి, సహాయ కార్యదర్శిగా మందడపు నాగమణి, అనుమోలు సరోజినీ ఎన్నిక య్యారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దివ్వెల వీరయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంత రావు, వెంకటరామయ్య పాల్గొన్నారు.