Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏడవ వార్డులో మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న భారతమ్మ అనారోగ్యానికి గురయ్యింది. కడుపులోని పేగులు చిక్కుకోవడంతో అవస్థకు గురై వైద్యశాలలో చేరింది. ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో భారతమ్మ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న ఏడవ వార్డు కౌన్సిలర్ సామల మాధవే రవితేజ మహబూబాబాద్‌లోని వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. వెంటనే స్పందించి రూ.15000 అందించి సహాయపడ్డారు. కౌన్సిలర్ ఆపన్న హస్తం అందించడం పట్ల పలువురు అభినందించారు.