Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లోని సాయినాధుని మందిరానికి భారీ విరాళం అందజేశారు. భద్రాచలం వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పొట్లూరి సింధు రూ.మూడు లక్షల 50 వేల విరాళం సోమవారం అందజేశారు. తన తాతయ్య, అమ్మమ్మ కీర్తిశేషులు అబ్బినేని రామచంద్రరావు, అనసూయల జ్ఞాపకార్థం, తన తండ్రి కీర్తిశేషులు పొట్లూరి వెంకటేశ్వర ప్రసాద్ జ్ఞాపకార్థం తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆలయ సభ్యులకు విరాళం అందజేశారు. విరాళం అందించిన దాత, కుటుంబ సభ్యులకు ఆలయ సభ్యులు శాలువాలతో సత్కరించారు. అర్చకులు వారి పేరున అష్టోత్తర నామార్చన జరిపి ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు అందజేశారు. గతంలో వీరి కుటుంబ సభ్యులు బాబా మందిరానికి నాలుగున్నర లక్షలు ఇచ్చి ఉన్నారు. నేడు ఇచ్చిన విరాళంతో మొత్తం కలిపి దానిపై వచ్చు వడ్డీతో ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడవ గురువారం శాశ్వత అన్నదానమునకు వినియో గించాలని దాత కుటుంబ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.